Trudeau: అమెరికాకు సాయం చేస్తాం:ట్రూడో 16 h ago
అమెరికాకి కాబోయే అధ్యక్షుడు ట్రంప్, కెనడా ప్రధాని ట్రూడో మధ్య వివాదం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాస్ఏంజెల్స్‌లో వ్యాపిస్తున్న కార్చిచ్చును అదుపు చేసేందుకు అగ్రరాజ్యానికి సాయం అందిస్తామని ట్రూడో వెల్లడించారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు.'కాలిఫోర్నియాలో వ్యాపిస్తున్న మంటల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. ఈ కార్చిచ్చులు మాకేమీ కొత్తకాదు. కెనడియన్ వాటర్ బాంబర్లు ఇప్పటికే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అమెరికాకు వనరులను అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం' అని ట్రూడో రాసుకొచ్చారు.